Friday, June 25, 2021

పుదుచ్చేరిలో 14 రోజుల లాక్‌డౌన్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాల జాబితాలో మరో రాష్ట్రం చేరింది. కరోనా వైరస్ కట్టడికి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారులు లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. మే 10 నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

లాక్‌డౌన్ సందర్భంగా పుదుచ్చేరి వ్యాప్తంగా బీచ్‌లు, పార్కులు, గార్డెన్స్ మూసి ఉంటాయని వెల్లడించింది. రాజకీయ, క్రీడా, సాంస్కృతిక, వ్యాపార సమావేశాలకు అనుమతి లేదంది. కిరాణా షాపులు, కూరగాయలు, మాంసం దుకాణాలు. పెట్రోల్ బంకులు, బ్యాంకులుచ వాటర్ సరఫరా చేసే సంస్థలు మధ్యాహ్నం 12 గంటలకు తెరుచుకోవచ్చని పేర్కొంది. కాగా పుదుచ్చేరిలో ఇప్పటివరకు 70,076 పాజిటివ్ కేసులు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News