Thursday, April 25, 2024

దమ్ముంటే అవినీతి నిరూపించు : బండి సంజయ్‌కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

ప‌ది రోజులు టైమ్ ఇస్తున్నా.. ద‌మ్ముంటే అవినీతిని నిరూపించాల‌ని బండి సంజ‌య్ కు మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనకు చేసిన ఛాలెంజ్‌కు రెడీ అన్నారు. 10 రోజులు టైమ్ ఇస్తానని, తన చిట్టా ఏంటో బయటపెట్టాలని బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని తాను సైతం బండి సంజయ్‌కి సవాల్ చేస్తున్నానని చెప్పారు.

తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకపోతే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు బీజేపీగానీ, బండి సంజయ్ గానీ ఇన్ని రోజులు ఏం చేశారో చెప్పాలని ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ సభలు, సమావేశాలు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయంటూ మంత్రి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement