Wednesday, September 20, 2023

ఉద్రిక్తతంగా మారిని రెజ‌ర్ల నిర‌స‌న‌.. ప‌లువురి అరెస్ట్

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద రెజ‌ర్లు చేప‌ట్టిన నిర‌స‌న ఉద్రిక‌త్తంగా మారింది. కొత్త పార్లమెంటు భవనం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా సహా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద వినేశ్ ఫోగట్, ఆమె బంధువు, సోదరి సంగీతా ఫోగట్ బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో రెజ్లర్లు, పోలీసుకు మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు ఒకరునొకరు తోసుకున్నారు. ఆందోళనకారులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement