Saturday, November 26, 2022

నా వ్య‌క్తిగ‌త హ‌క్కుల‌ని కాపాడండి.. ఢిల్లీ హైకోర్టుకి విన్న‌వించిన అమితాబ్ బ‌చ్చ‌న్

ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్.కేబీసీ లాటరీ లక్కీ డ్రా, కేబీసీ లాటరీ రిజిస్ట్రేషన్, అమితాబచ్చన్ వీడియో కాల్ తదితర రూపంలో ప్రచారం కోసం వినియోగిస్తున్న ఆధారాలను కోర్టుకు సమర్పించారు. తన పేరును, స్వరాన్ని, ఫొటోలను తన అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో నకిలీ లాటర్ స్కామ్, మరే ఇతర సంస్థ, వ్యక్తులు వాడుకోకుండా నిరోధించాలని, తన ప్రచార హక్కులను కాపాడాలని ఆయ‌న‌ పిటిషన్ లో కోరారు. దీన్ని విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా.. అమితాబ్ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. అమితాబ్ అనుమతి లేదా ధ్రువీకరణ లేకుండా ఆయనకున్న సెలబ్రిటీ హోదాను వినియోగించుకోవడాన్ని జస్టిస్ చావ్లా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో అమితాబ్ చెబుతున్నట్టు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. అమితాబ్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement