Wednesday, December 4, 2024

మెట్రోస్టేష‌న్ లో డెలివ‌రీ – మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌

దేశ రాజధానిలోని ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్‌లో 22 ఏళ్ల నిండు గ‌ర్భిణీ , మహిళా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. ఇతర మహిళా ప్రయాణికుల సహాయంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. మూడో నంబర్ ప్లాట్‌ఫారమ్‌లో మెట్రో కోసం వేచి ఉన్న మహిళకు ప్రసవ నొప్పులు వ‌చ‌చాయి. షిఫ్ట్ ఇన్ చార్జి సూచనల మేరకు సీఐఎస్‌ఎఫ్ గార్డు అనామిక కుమారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె, ఇతర మహిళా ప్రయాణికుల సహాయంతో, ప్రసవ నొప్పితో బాధపడుతున్న మహిళ ప్లాట్‌ఫారమ్‌లోనే బిడ్డకు జన్మనివ్వ‌డం విశేషం. ఈ మేర‌కు సిఐఎస్ ఎఫ్ ట్వీట్ చేసింది. సిఐఎస్ ఎఫ్ సిబ్బంది తక్షణ ప్రతిస్పందన ..అవసరమైన సహాయంతో ప్రసవ నొప్పితో బాధపడుతున్న ఒక మహిళకు అత్యవసర ప్రసవానికి సహాయం చేసారు @ ఆనంద్ విహార్ ISBT, మెట్రో స్టేషన్ అని ట్వీట్ లో తెలిపారు. అనంత‌రం తల్లితో పాటు నవజాత శిశువు ఆసుపత్రికి త‌ర‌లించామ‌న్నారు. కీలకమైన సమయంలో సత్వరమే స్పందించి అవసరమైన సహాయం అందించినందుకు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి మహిళ .. ఆమె భర్త కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement