Wednesday, October 4, 2023

ఫ్యాన్స్ కి థ్యాంక్స్ – అనివార్య కార‌ణాల వ‌ల్ల రాలేక‌పోయా – బండ్ల గ‌ణేష్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ , హీరో రానా న‌టించిన భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జ‌రిగింది. కాగా ఈ ఈవెంట్ లో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. అయితే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రతీ ఈవెంట్లకు వచ్చే టాలీవుడ్‌ అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌.. మాత్రం భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు రాలేకపోయాడు. దీంతో బండ్ల గణేష్‌ ఫ్యాన్స్‌ తో సహా.. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ చాలా నిరాశకు గురయ్యారు. నిర్మాత బండ్ల గణేష్‌..స్పీచ్ వినాలని ఎంతో మంది ఎదురు చూశారు. కానీ.. వారి ఆశలపై నీళ్లు పోస్తూ.. భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రాలేక పోయాడు నిర్మాత బండ్ల గణేష్‌. అయితే.. బండ్ల గణేష్‌ రాకపోవడంతో.. ఆయన ఫ్యాన్స్‌.. భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో రెచ్చి పోయారు. బండ్ల గణేష్‌ అన్న రావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది. అయితే.. ఆ వీడియోను బండ్ల గణేష్‌ ట్యాగ్‌ చేస్తూ.. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement