Wednesday, April 24, 2024

ప్రియాంక‌..నిక్ జోనాస్ ల కుమారై – పేరేంటో తెలుసా

స‌రోగ‌సీ ద్వారా ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చారు గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్. కాగా 2022 జనవరి 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. అయితే ఈ తాజాగా వీరి కుమారైకి పేరు పెట్టార‌ట‌. ప్రియాంక చోప్రా .. నిక్ జోనాస్ తమ కుమార్తెకు మాల్టీ మేరీ అని నామకరణం చేశారు. తాజా రిపోర్టుల ప్రకారం ఆ స్టార్ కిడ్ జనన ధృవీకరణ పత్రంలో, శిశువు పేరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్ అని ఉంది. ఆ చిన్నారి పేరు వెలుగులోకి రావడంతో నెట్టింట వైరల్ గా మారింది. మాల్టీ మేరీ నేమ్ కు అద్భుతమైన అర్థం కూడా ఉంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ తమ కుమార్తెకు మాల్టీ మేరీ అని పేరు పెట్టడంలో చాలా ప్రత్యేకత ఉంది. ‘మాల్తీ’ అనే పేరు సంస్కృత మూలం నుంచి తీసుకున్నారు. ఈ పేరుకు చిన్న సువాసన గల పువ్వు లేదా చంద్రకాంతి అనే అర్థం వస్తుంది. మేరీ అనే పదం లాటిన్ స్టెల్లా మారిస్ నుండి వచ్చింది. మేరీ అంటే సముద్రపు నక్షత్రం. దీనికి బైబిల్ పేరు కూడా ఉంది. ఇంత అద్భుతమైన అర్థమం వచ్చేలా నామకరణం చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement