Thursday, April 25, 2024

ఆర్ ఆర్ ఆర్ టీంకు అభినంద‌న‌లు తెలిపిన.. ప్ర‌ధాని మోడీ

గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ప్ర‌ధాని మోడీ స్పందించారు. చాలా ప్రత్యేకమైన సాఫల్యం అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు అభినందనలు తెలిపారు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లను కూడా అభినందిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు ప్ర‌ధాని. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అందడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement