Thursday, March 28, 2024

బాలిలో G20 సమ్మిట్.. వైరల్ అవుతోన్న మోడీ.. జో బైడెన్ వీడియో

ప్రధాని నరేంద్ర మోడీ..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరదాగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. కాగా ఇండోనేషియాలోని బాలిలో G20 సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ తో సహా 20 దేశాల, యూరోపియన్ యూనియన్‌లకు చెందిన అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. జీ 20 సదస్సులో పాల్గొనడంతో పాటు కీలక నేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశానికి భారత్ ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభమవడానికి ముందు సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ కాసేపు సరదాగా ముచ్చటించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) విడుదల చేసింది. రెండు రోజుల G20 సమ్మిట్.. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రసంగంతో మంగళవారం ప్రారంభమైంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంశంగా ప్రస్తావిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడు ఈ సమావేశాన్ని ప్రారంభించారు. బాధ్యతగా ఉంటే యుద్ధాన్ని ముగించాలి అని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగియకపోతే ప్రపంచం ముందుకు సాగడం కష్టమన్నారు. ప్రపంచం మరో ప్రచ్ఛన్న యుద్ధంలోకి జారిపోకూడదని అభిప్రాయపడ్డారు. ఈ సమ్మిట్‌లో కోవిడ్-19, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బనం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలపై జీ20 దేశాలు చర్చించనున్నాయి. ముఖ్యమైన ప్రపంచ సవాళ్లను అధిగమించే మార్గాలపై సమ్మిట్ విస్తృతమైన చర్చలు జరుపనుంది. ప్రపంచ వ్యాప్తంగా స్థిరాభివృద్ధికి ఈ సమ్మిట్ మార్గం చూపుతుందని యావత్ ప్రపంచం భావిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement