Saturday, December 7, 2024

ప్ర‌ధాని మోడీకి – ముస్లీం స్నేహితుడున్నాడ‌ని తెలుసా

ప్ర‌ధాని మోడీకి చిన్న‌నాటి స్నేహితుడు అబ్బాస్ ఉండేవార‌ట‌. ఈ విషయాన్ని తన తల్లి హీరాబాయి 100వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ బ్లాగు పోస్ట్ లో ప్రస్తావించారు.ఆయన పేరు అబ్బాస్. కానీ, ఆయన ఇప్పుడు భారత్ లో లేరు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం ఆహార పంపిణీ శాఖలో క్లాస్ 2 ఉద్యోగిగా పనిచేశారు. ఇటీవలే ఆయన సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. అబ్బాస్ కు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలో నివసిస్తున్నారు. చిన్న కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడగా.. రిటైర్మెంట్ తర్వాత అబ్బాస్ అక్కడికి వెళ్లారు. తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. ‘‘మా ఇంటికి సమీపంలోని గ్రామంలోనే మా నాన్న సన్నిహిత మిత్రుడు ఉండేవారు. ఆయన అకాల మరణం చెందడంతో, ఆయన కుమారుడ్ని మా నాన్న మా ఇంటికి తీసుకొచ్చారు. చదువు పూర్తయ్యే వరకు మన దగ్గరే ఉంటారని చెప్పారు. అందరి పిల్లల్లాగే అబ్బాస్ ను కూడా మా అమ్మ చూసేది. ఈద్ రోజున ప్రత్యేక వంటకాలు చేసి పెట్టేద‌ని మోడీ వెల్ల‌డించారు. మోడీని అంద‌రూ ముస్లీం వ్య‌తిరేకి అనుకుంటారు కానీ త‌న‌కు మంచి మిత్రుడుఅయిన అబ్బాస్ ముస్లీం అని చెప్పడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement