Thursday, June 8, 2023

ప్రధాని మోడీ సోదరుడికి త‌ప్పిన‌ పెను ప్రమాదం..

ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీకి మైసూరులో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని మైసూరులో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో మంగళవారం కర్ణాటకలోని మైసూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మైసూరు శివార్లలో కడ్కోళ్ల అనే ప్రాంతానికి చేరుకున్న అనంతరం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోడీకి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement