రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బాక్సులో ప్రధాని నరేంద్రమోదీ ఓటేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా పార్లమెంట్‌లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు తమ తమ అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడుతున్న విషయం తెలిసిందే.
- Advertisement -