Wednesday, May 19, 2021

కరోనా వేళ.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని పిలుపు

పశ్చిమ బెంగాల్‌లో ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఉపఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఉపఎన్నికల్లో ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కొత్తగా ఓటు వచ్చిన యువత తమ హక్కును మరిచిపోవద్దని సూచించారు. ప్రజలు తమ విధిగా పోలింగ్‌లో పాల్గొని దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అధిక సంఖ్యలో ప్రజలు ఓట్లు వేస్తారా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఉపఎన్నికలు జరుగుతున్న కొన్ని రాష్ట్రాలలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పిలుపునకు ప్రజలు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Prabha News