Sunday, May 22, 2022

గ‌ర్భిణీ మ‌హిళ‌కి క‌రోనా పాజిటీవ్ – డెలివ‌రీ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ , వైద్యులు

జనగామ : కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన గర్భిణీ మహిళకు కాన్పు చేశారు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన సానియా అనే మహిళ కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా అన్ని పరీక్షలు నిర్వహించారు. కాగా కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ కావడంతో కాన్పు చేయమని చెప్పటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా శిశు ఆసుపత్రి కి వెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకొని సాధారణ కాన్పు కాక పోవడంతో సిజేరియన్ చేశారు. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు ఎం సి హెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ పగిటిపాటి సుగుణాకరాజు , డి సి హెచ్ ఎస్ డాక్టర్ సంగీతా ,డాక్టర్ దీప్తి ప్రభ న్యూస్ కు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement