Monday, April 15, 2024

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేయనున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది. దీని తరువాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును చేయనున్నాడు. కేజీఎఫ్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్, మరోసారి మాస్ యాక్షన్ కంటెంట్ తో తారక్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడు ? సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నదానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయనున్న ఈ సినిమాను  2024 దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ కి ఒక లైన్ వినిపించి ఓకే అనిపించుకున్న ప్రశాంత్.. ఈ ప్రాజెక్టును దసరా రోజున ప్రారంభించాలని భావిస్తున్నాడట. ఈ ఏడాది చివరి నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రశాంత్ తెరకెక్కిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో ‘సలార్’ సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బీజీ కానున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement