Wednesday, April 24, 2024

ప్రశాంత్ కిషోర్ కొత్త స్ట్రాటజీ… 2024 ఎన్నికలకు సూపర్ స్కెచ్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ నిర్ణయం రాజకీయంగా సంచలనం అయింది. కేంద్రంలో బిజెపి యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రశాంత్కిషోర్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విపక్ష పార్టీల నేతలతో భేటీ అయ్యారు. సోనియా, రాహుల్, శరద్ పవార్ వంటి నాయకులతో ఇదే అంశంపై గతంలో చర్చించారు. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు పదవి నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ముందుకు నడిపించడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్‌కు ప్రాంతీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, ఉద్దవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, హేమంత్ సొరేన్, జగన్ మోహన్ రెడ్డి లాంటి వారితో దగ్గరి సంబంధాలున్న పీకే వీరిలో అత్యధికులకు పోల్ స్ట్రాటజిస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ పార్టీలన్నింటితో ఆయా రాష్ట్రాల్లో పొత్తులు కుదిర్చి ఎన్డీయేపై సమిష్టి పోరాటం చేయడానికి ప్రశాంత్ కిషోర్ ప్రణాళిక రచించినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement