Friday, May 27, 2022

ముదురుతున్న ‘మా’ వార్: విష్ణు ప్యానల్ పై ప్రకాశ్ రాజ్ ఫైర్

‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య పోటి జరగనుంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. గెలుపు కోసం మంచు విష్ణు ప్యానెల్ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీంతో ‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి.

మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని విష్ణు ప్యాన‌ల్ ఉల్లంఘిస్తోందన్న ప్రకాశ్ రాజ్.. మా ఎన్నిక‌ల్లో పోస్ట‌ల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందన్నారు. 60 ఏళ్ల‌కు పైబ‌డిన న‌టీన‌టులు పోస్ట‌ల్ బ్యాలెట్‌కు అర్హుల‌ని.. దీన్ని అవ‌కాశంగా చేసుకుని ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ల కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. అర్హ‌త ఉన్న స‌భ్యుల నుంచి విష్ణు ప్యాన‌ల్ సంతకాలు సేక‌రిస్తోంద‌ని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement