Wednesday, April 24, 2024

Ramayanam | ఆదిపురుష్​ న్యూలుక్​ అదుర్స్​.. ప్రమోషన్​ ప్రారంభించిన మూవీ టీమ్​

డార్లింగ్​ ప్రభాస్​ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్​ మూవీ గురించి కొత్త విషయాలు తెలిశాయి. ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్, పౌరాణిక ఫాంటసీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ టైటిల్ క్యారెక్టర్ లార్డ్ రామ్‌గా నటిస్తుండగా, కృతి సనన్ సీతగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి చెందిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇవ్వాల (మార్చి 30, గురువారం) శ్రీరామ నవమి ప్రత్యేక సందర్భంగా ప్రారంభమయ్యాయి. ప్రభాస్, కృతి సనన్,సన్నీ సింగ్‌తో కూడిన ఆదిపురుష్ కొత్త పోస్టర్‌ను ఇవ్వాల విడుదల చేయడం ద్వారా గ్రాండ్ ప్రమోషన్‌  లాంచ్​ చేశారు..

ఆదిపురుష్ కొత్త పోస్టర్.. అదిరిపోయిన లుక్​..

శ్రీరామ నవమి నుంచి ప్రారంభమయ్యే ఆదిపురుష్ ప్రచారానికి భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ మాతా వైష్ణో దేవి ఆశీర్వాదం కోరారు. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది ప్రధానంగా ఆరాధ్య దైవం శ్రీరాముని కథను తెలియజేయనుంది. చెడుపై పోరాడి సాధించిన విజయానికి సంబురాలను జరుపుకోనుంది.

ఇవ్వాల విడుదలైన ఆదిపురుష్ పోస్టర్‌లో శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ ఉన్నారు. సన్నీ సింగ్ కూడా పోస్టర్‌పై లక్ష్మణుడిగా కనిపించాడు. ముగ్గురూ వారి వారి వేషధారణలో ఉన్నారు. మూడు భాషల్లో ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, “మంత్రోన్ సే బధ్కే తేరా నామ్. జై శ్రీ రామ్ (sic)” అని ప్రభాస్ క్యాప్షన్ ఇచ్చాడు.

ఆదిపురుష్​ గురించి ఇంకా ఏంటంటే..

- Advertisement -

ఆదిపురుష్ అనేది రామాయణ ఇతిహాసం ఆధారంగా నిర్మితమైన పౌరాణిక నాటకం. ఈ చిత్రంలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. T-Series Films, Retrophiles ద్వారా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో,  సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఆదిపురుష్ 2023లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి కానుంది. ఈ చిత్రం కథాంశం 7000 సంవత్సరాల క్రితం లంకా ద్వీపానికి ప్రయాణించిన అయోధ్య రాజు రాఘవను అనుసరిస్తుంది. అతనికి ఒక లక్ష్యం ఉంది.. – లంక రాజు, లంకేష్ అయిన రావణుడు తన భార్య జానకిని అపహరించగా.. ఆమెను రక్షించడం సినిమాలో మెయిన్​గా ఉంటుంది. జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement