Sunday, March 26, 2023

ఆదిపురుష్ బిగ్ అప్ డేట్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో  ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఆదిపురుష్ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

తాజాగా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా,  ప్రభాస్, పూజహెగ్డే కాంబోలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement