Thursday, September 16, 2021

నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు.. ఫ్యాన్స్ హంగామా షురూ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వినబడితే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగాల్సిందే. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నీడలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ సెపరేట్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. నేడు(సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 50వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు.

పవర్ స్టార్ అభిమానులకు నేడు పండగ రోజు అని చెప్పొచ్చు. పవన్ కల్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు రెడీ అయ్యారు. ప‌వ‌న్ 50వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సారి అభిమానులు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ప్ర‌త్యేకంగా జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఒక‌వైపు ప‌వ‌న్ బ‌ర్త్ డే హంగామాతో పాటు మ‌రోవైపు ఆయ‌న పేరుతో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకి సంబంధించిన అప్‌ డేట్స్ రానున్నాయి.

యూత్ లో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా.. అభిమానుల్లో ఫాలోయింగ్ మాత్రం ఆకాశమంత ఉంటుంది. పవర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి సినిమా వ‌స్తుందంటే.. అభిమానుల్లో జోష్ మామూలుగా ఉండ‌దు. అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే ఆయన కొత్త సినిమా గురించి ఏదో ఓ అప్‌డేట్ గురించి వేచి చూస్తుంటారు అభిమానులు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో బర్త్ డే అంటే కచ్చితంగా కొత్త సినిమాల గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దాంతో ఈసారి పుట్టిన రోజుకు కచ్చితంగా సర్‌ ప్రైజులు భారీగానే ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.

పవన్ తాజా సినిమాలకు సంబంధించిన కొత్త విషయాలను దర్శక, నిర్మాతలు ఇవాళ(సెప్టెంబర్ 2) అనౌన్స్ చేయబోతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టారు. ఇప్పుడు సెట్స్ మీద ‘భీమ్లా నాయక్ , హరి హర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటే బండ్ల గణేశ్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేస్తానని కమిటయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News