Thursday, April 25, 2024

లాయర్ పాత్రలో అదరగొడుతున్న పవర్‌స్టార్

పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు థియేటర్లలో ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి దిల్ రాజు, వేణు శ్రీరామ్, తమన్ సహా పలువురు హాజరయ్యారు.

ట్రైలర్‌లో లాయర్‌గా పవన్ చెప్పిన డైలాగులు, ఆయన చేసిన ఫైట్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఓ మగాడిని ‘ఆర్ యూ వర్జిన్’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించే సీన్ ఈ ట్రైలర్‌కే హైలెట్. బాలీవుడ్ మూవీ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నివేదా థామస్, అంజలి కీలకపాత్రల్లో నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అతడు అందించిన పాటలు ఇప్పటికే శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement