Friday, April 19, 2024

పోప్ ఫ్రాన్సిస్ కి శ్వాస‌కోస ఇన్ఫెక్ష‌న్.. హాస్ప‌ట‌ల్ లో చికిత్స‌

గ‌త కొంత‌కాలంగా శ్వాస‌కోస ఇన్ఫెక్ష‌న్ తో ఇబ్బంది ప‌డుతున్నారు పోప్ ప్రాన్సిస్. దాంతో ఆయ‌న‌కి డాక్ట‌ర్స్ చికిత్స‌ని అందిస్తున్నారు.కాగా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కోవిడ్‌కు సంబంధించినది కాదని వైద్యులు పరీక్షల్లో నిర్ధారించారు. కొన్ని రోజులపాటు దవాఖానలోనే చికిత్స తీసుకుంటారని వైద్యులు తెలిపారు. 86 ఏళ్ల పోప్‌కు కరోనా లేదని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ వెల్లడించారు. పోప్‌ ఫ్రాన్సిస్‌ గతంలో కూడా 10 రోజులపాటు గెమెల్లీ దవాఖానలో చికిత్స పొందారు. 2021 జులైలో ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు పెద్ద పేగులో 13 ఇంచులు తొలగించారు. కాగా, ఈస్టర్‌ నేపథ్యంలో ఈ ఆదివారం నుంచి ప్రారంభంకానున్న హోలీ వీక్‌ వేడుకల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement