Saturday, April 20, 2024

పాప్ సింగ‌ర్ బ‌యోపిక్.. మైఖేల్ జాక్స‌న్ గా ఆయ‌న మేన‌ల్లుడు

ఇప్ప‌టికే సినీ ప‌రిశ్ర‌మంలో ఎంద‌రో బ‌యోపిక్ లు తెర‌కెక్కాయి. కాగా తాజాగా దివంగ‌త పాప్ సింగ‌ర్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించనున్నారు. గ్రాహం కింగ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాఫర్ చాలా కాలంగా మైఖేల్ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు.ఈ పాత్ర కోసం జాఫర్‌ గత 6 నెలలుగా కష్టపడుతున్నాడని బ్రాంకా ఆ వీడియోలో వెల్లడించారు.

ఇందుకు సంబంధించి జాఫర్‌ బ్లాక్‌ అండ్ వైట్‌ ఫొటోను జీకే ఫిల్మ్స్‌ షేర్‌ చేసింది. ఈ ఫొటోలో మైఖేల్‌ జాక్సన్‌ అవతారంలో జాఫర్‌ పూర్తిగా మునిగిపోయి కనిపించాడు. మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ కో ఎగ్జిక్యూటర్, ఎంటర్‌టైన్‌మెంట్ లాయర్ అయిన జాన్ బ్రాంకా.. మైఖేల్‌ బయోపిక్‌లో ప్రధాన పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్‌ పోషిస్తున్నట్లు వెల్లడించే వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మైఖేల్‌ జాక్సన్‌తో జాఫర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నదని బ్రాంకా చెప్పారు. జాఫర్‌ని చూడగానే అచ్చం మైఖేల్‌ను చూసినట్లుగా భావించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే మైఖేల్‌ను ఫాలో అవుతున్నందున వాకింగ్‌ స్టైల్‌ ఒక్కటే కాకుండా వాయిస్ కూడా అచ్చం మైఖేల్‌ని పోలి ఉంటుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement