Saturday, April 20, 2024

ప్రభన్యూస్ EXCLUSIVE: కరోనా వల్ల చితికిపోతున్న బడుగుజీవులు.. పట్టించుకునేదెవరు?

కుటుంబ పోషణ కరువై..
బ్రతుకు బరువై..
బజారున పడుతున్న బడుగుజీవులు
ఉద్యోగాలు పోయి.. ధీనావస్థలో వీధుల్లోకి
కరోనా వేళ కరుణ చూపలేని యాజమానులు
పోషణ కోసం బిక్షాటనకు వెనుకాడని ధీనస్థితి

హైదరాబాద్: ఎన్నో ఏళ్లపాటు నమ్ముకున్న వారికోసం అహర్నిశలు కష్టించిన బడుగు జీవులకు బ్రతకడమే ప్రశ్నార్థకంగా మారుతోంది. కుటుంబ పోషణ కరువై… బ్రతుకు బండిని లాగడం బరువై కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమపైనే ఆధార పడిన కుటుంబానికి ఆసరా ఉండేందుకు బిక్షాటనకు సై తం సిద్ధపడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బిక్షాటన చేస్తే.. వచ్చే చీదరింపులను తట్టుకోలేక ప్ల కార్డులతో మౌనంగా నడిరోడ్లపై నడయాడుతున్నారు.

క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం మాదిరిగా భవిష్యత్‌లో కరోనాకు పూర్వం, కరోనా తరువాత అనుకునే రోజులు కచ్చితంగా వస్తాయన్న పరిస్థితులు ప్రస్తుతం బడుగు, బలహీన, పేద, నిరుపేద వర్గాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారస్తుల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ.. వివిధ వర్గాల ప్రజ లపై ఆధారపడిన వారి స్థి తిగతులు.. ప్రస్తుతం అగమ్యగోచలంగా తయారైనట్లు తెలుస్తోంది. విశ్వనగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్‌ మహానగరంలో ఎన్నో జిల్లాలు, ప్రాంతాలు.. రాష్ట్రాల నుంచి వచ్చి.. డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పనివారలుగా కాలం వెళ్లదీస్తున్న వారికి కరోనా కారణంగా ఉపాధి కరువైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యాపారాలు సరిగ్గా నడవక నష్టాల పాలవుతున్న వ్యాపారులు చాలామంది, తమకు ఇంత కాలం సహాయకంగా ఉన్న డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పనివారలను పనుల్లోంచి తీ సివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం ఒకరికి మరొకరు ధైర్యంగా కలవలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సామాన్యులకు ఉద్యోగ భద్రత కరువవుతోంది. ఎన్ని పథకాలు పెట్టినా, సంక్షేమం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, కొందరికే చేరుతున్న పరిస్థితులు, పైరవీలు చేయలేని, పరిచయాలు లేని వారికి దక్కడం లేదన్న విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. కేవలం కులాలు, వర్గాల వారిగా సాగిస్తున్న సంక్షేమ పథకాల అమలులో చాలా వరకు పార్టీ నాయకుల అనుచరులకే తొలి ప్రాధాన్యంగా దక్కుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో చాలామందికి ఎక్కడ ఏ పథకం తమకు దక్కుతుందో తెలియని స్థితిలో కుటుంబాలను నెట్టుకొస్తున్న తీరు కరోనా విధించిన శిక్షకు తార్కాణంగా కనిపిస్తోంది.

స్థానిక కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి చేతిలో ప్లకార్డుతో బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఏంటని ఆరా తీస్తే.. నేనో ప్రొఫెషనల్‌ డ్రైవర్‌ను. కరోనా కారణంగా పనేమీ లేదంటూ తనను ఉద్యోగం నుంచి తీసివేశారని, దీంతో కుటుంబ పోషణ కోసం రోడ్డెక్కక తప్పలేదని వాపోయ్యాడు. ఇది ఏ ఒక్కరిదో కాదు. నగరంలో బ్రతికేందుకు విచ్చేసిన వేలాది మంది సమస్య. ఇటువంటి సమస్యలకు రాజకీయ కోణంలో కాకుండా సహృదయంతో ఆలోచన చేసి, ఆయా కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను గురు చేసే సంఘటన ఇది. మరి ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు ఆ దిశగా పకడ్బందీ ప్రణాళికలతో బడుగు జీవులకు భరోసాగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం కులాలు, వర్గాల వారిగా సంక్షేమం పేరిట నిధులను ఖర్చు చేయడమే కాకుండా, వారి ఆర్థిక స్థి తిగతులను మార్చేందుకు కులమతాలకు అతీతంగా సాయమందించాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

డ్రైవర్‌గా చేశా.. ప్రస్తుతం బిక్షాటన చేస్తున్నా: అంజి
ఏళ్ల తరబడి వ్యక్తులనే నమ్ముకొని డ్రైవర్‌గా చేశా. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వారికి నన్ను భరిం చడం
కష్టంగా మారింది. వారి ఇబ్బందులు వారికి ఉంటాయి. కాని నాకు ఇక్కడ ఉపాధి కరువైంది. ఇంటికి వెళ్లగలిగే పరిస్థితులు లేవు. అందుకే ఎవరైనా ఉద్యోగం కల్పిస్తారేమో అన్న ఆశతో రోడ్డెక్కా. కాని కొందరు చూస్తున్న తీరుతో ప్ల కార్డుతో రోడ్డుపై నిల్చున్నా.. ఉద్యోగం కల్పించినా సరే.. నా కుటుంబానికి అన్నమైనా పెట్టండి.’

Advertisement

తాజా వార్తలు

Advertisement