Wednesday, April 24, 2024

వకీల్ సాబ్ పై పూనమ్ ట్వీట్.. షాక్ లో ఫ్యాన్స్

నటి పూనమ్‌ కౌర్‌ వకీల్‌సాబ్‌ సినిమాపై ట్విట్టర్‌ మాధ్యమంగా సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసింది. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన వకీల్‌సాబ్‌ ఏప్రిల్‌ 9న విడుదలైంది. సినిమాకు హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ను సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. అయితే ఈమధ్య వకీల్ సాబ్ సినిమా మా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టికెట్ రేట్ల ఈ విషయంలో బిజెపి జనసేన నేతలు లు వైసీపీ పై విమర్శలు గుప్పించారు.

ఈనేపథ్యంలో పూనమ్కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. “సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన వివాహంలాంటిది. ఇది ఒక వ్యవస్థీకృత సంబంధం. ఇది కేవలం కొంత మంది వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చాలి. కాని కాపురం చేయకపోతే ఫీల్‌ అయ్యేది ప్రజలు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్‌ చేయాలి. కానీ డీ ఫేమింగ్‌ ఆర్గనైజ్డ్‌ ట్రెండ్‌ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్లు రాజకీయాలు?. అమ్మాయిలను డీఫేమ్‌ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లమ్‌ ఎవరికి? పోసానిగారు ప్రెస్‌మీట్‌?” అంటూ పోసాని కృష్ణమురళిని టార్గెట్‌ చేస్తూ పూనమ్‌ చేసిన ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement