Friday, April 26, 2024

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళ‌న‌..ఈ స‌మ‌స్య‌పై తీవ్రంగా చ‌ర్చిస్తున్నాం..సీజేఐ ఎన్వీర‌మ‌ణ‌..

ఢిల్లీ కాలుష్యంపై తీవ్రంగా చ‌ర్చిస్తున్నామ‌ని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. ఢిల్లీ కాలుష్యంపై అధికార యంత్రాంగం ఏం చేస్తుంద‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది..ఢిల్లీలో పెరుగుతోన్న కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వాయుకాలుష్యాన్ని కేంద్రానికి, ఢిల్లీ సర్కారుకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిల్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. మేము ఈ సమస్య గురించి తీవ్రంగా చర్చిస్తున్నామని అన్నారు సీజేఐ ఎన్వీ రమణ. ఢిల్లీ కాలుష్యంపై అధికార యంత్రాంగం ఏం చేస్తుందని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది.

పంట వ్యర్థాలను తగలబెట్టడంపై క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడవచ్చు కదా..అని సూచించింది. ఉత్తర్ ప్రదేశ్, హర్యాణా, పంజాబ్ ప్రభుత్వాలు వాయు కాలుష్యాన్ని ఎంత వరకు తగ్గించారు.. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగింది. వచ్చే రెండు మూడు రోజుల పాటు వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కొనసాగించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఈలోగా కాలుష్య స్థాయి 100కి చేరితే కొన్ని ఆంక్షలను ఎత్తివేయవచ్చని సూచించింది. ఢిల్లీలో వాయు కాలుష్య సమస్య తీరే దాకా తుది ఉత్తర్వులు ఇవ్వబోయని స్పష్టం చేసింది. వాతావరణం తీవ్రంగా మారితే చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాల‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement