Thursday, April 18, 2024

Poli’trics’ – క‌మ‌ల‌మా… హ‌స్త‌మా… మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌న్న పొంగులేటి, జూప‌ల్లి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాజకీయాల్లో ఈటల, పొంగులేటి, జూపల్లి రహస్య భేటీ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గన్‌మెన్లకు కూడా అనుమతి లేకుండా ఈటల జూపల్లి, పొంగులేటితో ఏం చర్చించా రనన్న అంశంపై ఉత్కంఠ రేపుతోంది. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ఈ ఇద్ద‌రిని హ‌స్తం గూటికి చేర్చేందుకు త‌మ వంతు ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేసింది.. దీంతో ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌ల్ల‌గుల్ల‌లు ప‌డుతున్నారు.. కాగా రానున్న అసెంబ్లి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వం ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అసం తృప్తి నేతలే టార్గెట్‌గా ఆ పార్టీ ప్రయ త్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో బలమైన నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీ యాల్లో కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎలాగైనా బీజేపీలోకి తీసుకు రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే బీజేపీలో చేరే విషయమై పొంగులేటి, జూపల్లి తేల్చకపో వడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకునేలా బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి పొంగులేటి, జూపల్లితో సమావేశం కావాలని ఈటలను అధిష్టానం ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది.

ఇప్పటికే గురువారం నగర శివార్లలో పొంగులేటి, జూపల్లితో ఈటల రహస్య భేటీ నిర్వహించారు. అయితే ఈ భేటీ తర్వాత కూడా తమ నిర్ణయాన్ని పొంగులేటి, జూపల్లి ప్రకటించకపోవడంతో వారి రాజకీయ వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉమ్మడి శత్రువైన బీఆర్‌ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించడమే లక్షమై నందున బీజేపీలో చేరాలని ఈటల పొంగులేటి, జూపల్లికి ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ దగ్గరున్న వ్యూహాలు, తెలంగాణలో బీజేపనీకి ఉన్న బలం, ప్రజల్లో ఆదరణ, ఎన్ని సీట్లలో గెలుపు సాధ్యం తదితర అంశాలపై ఈటలను పొంగులేటి, జూపల్లి లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈటల తీరుపైనా అనుమానాలు…?
అదే సమయంలో పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నా రని, ఆ క్రమంలోనే ఈటల వారితో రహస్య భేటీ జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త నేతల చేరికలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. కొత్త నేతల చేరడం అటుంచితే పార్టీ లో ఉన్న నేతలు కూడా చేజారే ప్రమాదముందన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈటలపై బీజేపీ శ్రేణుల్లోనే అనుమానాలు నెల కొనడంతో పొంగులేటి, జూపల్లితో జరిగిన చర్చల్లో వారిని బీజేపీకి ఆహ్వానించే అంశాన్ని చర్చించారా..? లేక బీజేపీలోకి రావడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో పరోక్షంగా ప్రయోజనం కలిగించే ప్రత్యామ్న్యాయాలపై ఈటల వారితో చర్చించారా..? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement