Friday, March 29, 2024

Political Agenda – భార‌త్ నిండా డ‌బ్బు గోడౌన్ లు

న్యూఢిల్లి: చలామణి నుంచి 2 వేల నోట్లు ఉపసం హరించుకోవాలని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రేరిత కారణాలు ఉండవచ్చని ప్రముఖ ఆర్థిక నిపుణుడు జెఫ్రిన్‌ క్రిస్‌ ఉడ్‌ అభి ప్రాయపడ్డారు. 2 వేల నోట్ల రద్దుపై ఆయన గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ అనే వీక్లీలో ఒక వ్యాసం రాశారు. 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడాన్ని ఆయన మినీ నోట్ల రద్దుగా పేర్కొన్నారు. అవినీతి నిరోధక చర్యలో భాగంగా నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, దీని వెనుక రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు ఫండింగ్‌ రాకుండా అడ్డుకునే ఉద్దేశ్యంతోనే 2 వేల నోట్లను చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నారని ఆయన వ్యాసంలో పేర్కొన్నారు. భారత్‌లో నగదుతో నిండిన గోడౌన్ల నుంచే ఎన్నికలకు నిధులు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో ఈ సంవత్సరం అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని, 2024లో పార్లమెం ట్‌ ఎన్నికలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సంవత్సరం రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరామ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి మళ్లి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న తరణంలో కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపొందిందని జెఫ్రీన్‌ క్రిస్‌ ఉడ్‌ పేర్కొన్నారు.

స్టాక్‌ మార్కెట్‌ కోణం నుంచి చూస్తే చాలా స్పష్టంగా సానుకూల అంశం ఏంటంటే, ద్రవ్యోల్బణం పడిపోవడంతో, ద్రవ్య నియంత్రణ చర్యలు ముగిసే అవకావం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇండియాలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.7 శాతానికి తగ్గిందని, ఇది మే నాటికి 4 శాతానికి పడిపోతుందని ఉడ్‌ అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం సరాసరిగా ద్రవ్యోల్బణం 5 శాతం వరకు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లను ఈ సంవత్సరంలో కాని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాని తగ్గించే అవకాశం ఉందని అంచనా వేశారు. ద్రవ్యవిధానం కఠినతరం చేయాల్సిన దశ ముగిసిందని, బయటి కారణాలు సమీపకాలంలో ట్రిగ్గర్‌ అయ్యే అవకాశం తక్కువగా ఉందన్నారు. స్టాక్‌ మార్కెట్‌ పనితీరు ఆశాజనకంగా ఉందని, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement