Wednesday, January 19, 2022

Breaking: వనమా రాఘవపై చర్టపరంగా చర్యలు.. కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్మపేట మండలం మంగళపల్లిలో రాఘవను కస్టడీలోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. రాఘవ అనుచరులు గిరీష్, మురళీని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రాఘవకు చావా శ్రీనివాస్, రమాకాంత్ సాయం చేశారని తెలిపారు. నిందితుడు వనమా కోసం 8 ప్రత్యేక బృందాలు గాలించాయని చెప్పారు. నిందితులపై సెక్షన్ 312 కింద కేసులు నమోదు చేశామన్నారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగూడెం కోర్టులో రాఘవను హాజరుపరుస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News