Friday, March 29, 2024

షాపు గోడ కూలి హెడ్ కానిస్టేబుల్ మృతి.. మ‌రో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఓ దుకాణానికి చెందిన పాత గోడ కూలిన ఘ‌ట‌న‌లో పోలీసు హెడ్‌ కానిస్టేబుల్ చ‌నిపోయాడు. మ‌రో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఘ‌ట‌న జ‌రిగింది. డ్యూటీలో భాగంగా నిన్న రాత్రి రౌండ్స్‌కు వెళ్లారు శ‌ర‌వ‌ణ‌న్‌, క‌న్న‌న్ అనే ఇద్ద‌రు పోలీసు కానిస్టేబుళ్లు. ఆ క్ర‌మంలో ఓ షాపు ముందు నిల‌బ‌డి ఉండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వందేళ్ల నాటి పాత గోడ కావ‌డం.. మొన్న‌టి దాకా కురిసిన భారీ వ‌ర్షాల‌కు బాగా నాని ఉండ‌డంతో అది ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది.

ఈ ప్ర‌మాదంలో హెడ్ కానిస్టేబుల్ శ‌ర‌వ‌ణ‌న్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. క‌న్న‌న్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అత‌డిని స‌మీపంలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా అది వందేళ్ల నాటి పాత బిల్డింగ్ అని.. దాన్ని ఇంత‌కాలం కూల్చ‌కుండా అలాగే రెంట్‌కి న‌డుపుతున్న‌ బ‌ల్డింగ్ ఓన‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు పోలీసులు. త‌దుప‌రి విచార‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement