Friday, March 29, 2024

పాకిస్థాన్ పోలీసుల దుశ్చ‌ర్య – భార‌త ప్ర‌ధాని మోడీకి విజ్ఞ‌ప్తి చేసిన బాధిత కుటుంబం

పాకిస్థాన్ ప్ర‌భుత్వ అధికారులు హిందువుల ఆస్తుల‌ను బ‌ల‌వంతంగా ఆక్ర‌మిస్తున్నారు. కొంద‌రు పోలీస్ అధికారులు ఓ హిందూ కుటుంబాన్ని ఇంటి నుండి బ‌య‌టికి తీసుకువ‌చ్చి, వారి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆ ఫ్యామిలీ మంచుకురిసే స‌మ‌యంలో నిరాశ్ర‌యులుగా రోడ్డుపై ఉండిపోయారు. ఈ మేర‌కు ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ సంఘ‌ట‌న ఆజాద్ కాశ్మీర్‌లోని ముజఫరాబాద్ చోటు చేసుకున్నట్టుగా ఈ వీడియోను పోస్ట్ చేసిన పాకిస్థాన్‌కు చెందిన ప్రొఫెసర్ సజ్జాద్ రజా తెలిపారు. పోలీసుల చర్యపై బాధిత కుటుంబం..భార‌త ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. తన పిల్లలు రోడ్డున పడుతున్నారని కుటుంబ పెద్ద చెప్పారు. ఏం జరిగినా ముజఫరాబాద్‌ కమిషనర్‌దే బాధ్యత అన్నారు. అధికారులు తమ భూమిని మాకు ఇవ్వకపోతే.. సహాయం కోసం భారతదేశాన్ని అడుగుతామన్నారు. మోడీ జీ వచ్చి వాటిని సరిదిద్దాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఆ స్థలం తమేదనని… ఆ భూములు సిక్కులు, ముస్లిమేతరులవని.. ఎవరి తండ్రివి కావని మండిపడ్డారు. భారత ప్రధాని మోడీ.. తమకు ఈ అణచివేత నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement