Saturday, October 12, 2024

పోలీసుల‌ బ‌స్సు బోల్తా : ముగ్గురు మృతి, 14మందికి గాయాలు

పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడటంతో ముగ్గురు పోలీసులు స్పాట్ లోనే మృతిచెంద‌గా, మరో 14 మంది గాయపడిన ఘ‌ట‌న‌ ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాలోని పాపడహండి పీఎస్ పరిధిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాయ‌ప‌డిన‌ వారందరినీ చికిత్స నిమిత్తం పాపడహండి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఒడిశా లోని నబరంగ్ పూర్ లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు 40-45 మంది భద్రతా సిబ్బంది బస్సులో బయల్దేరారు. ఆ బస్సు పాపడ హండి నుంచి కొసగుముడకు వెళ్తుండగా.. బ్రేకులు ఫెయిలయ్యాయి. డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా.. బ్రేకులు పనిచేయకపోవడంతో ఓ మలుపు వద్ద బస్సు బోల్తా పడి 15 అడుగుల వరకూ దూసుకెళ్లింది. స్థానికులు ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బంది రవి బిసోయ్, సిహెచ్ శేషారావు, జగబంధు గౌడగా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement