Thursday, April 25, 2024

పొయెస్ గార్డెన్ లో న‌య‌న‌తార నివాసం.. పెళ్లి త‌ర్వాత ఇక్క‌డే..


పొయెస్ గార్డెన్..త‌మిళనాడులో అతి ఖ‌రీదైన ఏరియాగా చెబుతుంటారు. ఇక్క‌డే దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌, త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ల ఇళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో స్టార్ హీరోయిన్ న‌య‌నతార ఇల్లు కొనుగోలు చేయ‌నుందట‌. పెళ్ళి త‌ర్వాత కాబోయే భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి ఆ ఇంట్లో ఉండ‌బోతోంద‌ని స‌మాచారం.అయితే న‌య‌న‌తార ఈ పోయేస్ గార్డెన్‌లో ఇల్లు కొన‌గోలు చేసేందుకు భారీగానే ఖ‌ర్చు చేస్తుంద‌ట‌. త‌ను క‌న్న క‌ల‌ను నెర‌వేర్చుకునే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌ని తన‌ స‌న్నిహితుల‌తో తెలిపింద‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ అమ్మ‌డు పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement