Saturday, June 3, 2023

కేంద్రం చేతిలో ఆయుధం మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐ దాడులు, దర్యా ప్తులు పెరిగిన నేపథ్యంలో మనీ లాండరింగ్‌ నిరోధక (పీఎంఎల్‌ఏ) చట్టాన్ని సవరించాలన్న అంశం తాజాగా తెరపైకి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయ కూటములకు అతీతంగా ఉన్న ప్రాంతీ య పార్టీలన్నీ ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా, ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాయి. త్వరలోనే ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వ్యూహరచన జరుగుతోంది. ఇందుకు సంబంధిం చి దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలిపే కార్యక్రమాలకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గం కూడా సిద్ధంగా ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ రాజకీయ ఎత్తుగడలకోసం పాక్షికంగా ఉపయో గించుకోవడం గతంలో ఉండేదని, భాజపా నేతృ త్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఆ వ్యవహారం కాస్త మితిమీరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయిన దానికీ, కానిదానికీ దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపడం, విచారణ, దర్యాప్తు పేరుతో భయ పెట్టడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకి స్తోంది. తాజాగా ఢిల్లిd మద్యం కుంభకోణం కేసులో తెలంగాణాకు చెందిన ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది నాయకులు ఈడీ విచారణను ఎదుర్కొంటుండడం, విచారణలో ఉద్దేశపూర్వక కోణం ఉందని రాజకీయ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే అదునుగా బీఆర్‌ఎస్‌తో కలిసివచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని మనీ లాండరింగ్‌ నిరోధక (పీఎంఎల్‌ఏ) చట్టాన్ని సవరించాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

- Advertisement -
   

గత కొంత కాలంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టానికి కేంద్రం చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈడీకి విస్తృత అధికారాలు కట్టబెట్టేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గత ఏడాది ఆగస్టు నుంచి విపక్షాలు ఆరోపిస్తు-న్నాయి. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు మరింత ఊతం ఇచ్చే విధంగా టీ-ఎంసీ, డీఎంకే, ఆప్‌, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్పీ, ఎండీఎంకే, ఆర్జేడీ, ఆర్‌ఎల్డీ, ఐయూఎంఎల్‌ తదితర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్తంగా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరైన మద్ధతు కూడగట్టుకోలేక ఉద్యమ పంథా డీలా పడింది. తాజాగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ చట్టం సవరణ జరిగేంత వరకూ పోరాటం కొనసాగించాలని నిర్ణయించడంతో నాడు వ్యతిరేకించిన పార్టీలన్నీ నేడు ముందడుగు వేస్తున్నాయి. ఈ విషయంలో తీర్పును పున:సమీక్షించాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి. తీర్పుపై దేశవ్యాప్త ఆందోళన వ్యక్తం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఉండగా పీఎంఎల్‌ఏ చట్టానికి చేసిన సవరణలను కొట్టివేయాలని కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరంతో పాటు- 240 మంది సుపీం కోర్టులో సవాల్‌ చేయగా, చట్ట సవరణలన్నీ సరైనవేనని కోర్టు సమర్థించింది.

సవరణకు ముందు చట్టం చెప్పిన అంశాలివీ..

 • పీఎంఎల్‌ఏ కింద ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ డైరెక్టర్‌ లేదా డిప్యూటీ- డైరెక్టర్‌ కంటే పై ర్యాంక్‌ ఆఫీసర్లకు మాత్రమే అధికారం ఉంటు-ంది.
 • స్వతంత్ర ట్రిబ్యునల్‌ నుంచి ఈడీ అనుమతి తీసుకోవాలన్న క్లాజును పీఎంఎల్‌ఏ నుంచి తొలగించారు.
 • మనీలాండరింగ్‌ ఆరోపణలు వస్తే, సదరు వ్యక్తికి తొలుత నోటీ-సులు ఇస్తారు.
 • ఆ వ్యక్తి తన ఆస్తులు చట్టబద్ధమైనవేనని నిరూపించుకోవాలి.
 • తాజా సవరణల ప్రకారం నిందితులకు ఈడీ ఈసీఐఆర్‌ కాపీని ఇవ్వాల్సిన అవసరం లేదు.
  విచారణలో విచక్షణ
 • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు రాజ్యాంగంలో ఎక్కువ అధికారాలు ఇచ్చారు. వారు పోలీస్‌ స్టేషన్‌, బ్యాంకులు, ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్టమెంట్‌కు ఫోన్‌ చేసి ఏదైనా సమాచారాన్ని తీసుకుంటారు.
 • ఫోన్‌ కూడా లేకుండా ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. ఒక వేళ సమాచారం అడిగితే తప్పకుండా ఇవ్వాల్సిందే. కాదు కూడదు అనడానికి వీలు లేదు.
 • పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవచ్చు. ఈ అధికారాల వల్ల మంచి అధీకృతమైన స్పష్టమైన ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు- ఉంటాయి.
 • కోర్టులు కూడా కాదనలేకుండా పటిష్టమైన ఆధారాలు దగ్గర పెట్టు-కుంటాయి. అందుకే ప్రీఎమ్మెల్యే ప్రివెర్షన్‌ ఆప్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద శిక్షలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
 • అక్రమార్జనను అక్రమ మార్గంలో తరలించే విధానాన్ని అడ్డుకోవడానికి ఈడీ ప్రయత్నాలు చేస్తుంటు-ంది.
 • ఈడీ పెట్టిన మనీ లాండరింగ్‌ 100 కేసుల్లో 96 శాతం శిక్షలు పడుతున్నట్లు- తెలుస్తోంది.
 • ఈడీ చేసే సోదాల్లో కచ్చితత్వమైన విధానం వల్ల దాదాపు అన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయి.
 • కోర్టులు గనక విచారణను వేగవంతం చేస్తే శిక్షలు ఇంకా తొందరగా పడతాయి. కానీ కోర్టుల్లో కేసులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి.
 • ఈ కేసుల్లో వేగంగా విచారణ చేయడం కుదరదు. కానీ ఈడీ మాత్రం తన అధికారాలను ఉపయోగించుకుని ప్రతి కేసులో కచ్చితమైన ఆధారాలను సేకరిస్తుంది.
 • ప్రతి దాంట్లో ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు దొర్లకుండా చూసుకుంటు-ంది.
 • ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఏకంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను అరెస్టు చేసింది.
 • అంటే ఈడీ విచారణ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రినే జైల్లో పెట్టిందంటే ఈడీ ఎంతటి బలమైన ఆధారాలను సమర్పించిందో అర్థం చేసుకోవచ్చు.
  ఈడీ అధికారాలు అపరిమితం కాదు : ఢిల్లీ హైకోర్టు
  ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారాలపై గత ఏడాది జనవరిలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈడీకి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయని, ఈడీ అధికారాలు అపరిమితమేమీ కాదని కోర్టు గుర్తు చేసింది. మనీలాండరింగ్‌ కేసులను మాత్రమే ఈడీ విచారించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతీదాంట్లో ఈడీ జోక్యం తగదని ఛత్తీస్‌గడ్‌లోని కోల్‌బ్లాక్‌ల కేటాయింపుకు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సెక్షన్‌ 3 నేరాలను మాత్రమే పరిశోధించడానికి పిఎంఎల్‌ ఈడీకి అధికారం ఇచ్చిందని, ప్రతి దాంట్లో ఈడీ జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు హితవు పలికింది. విచారణ సందర్భంగా వేరే నేరాలు వెలుగులోకి వస్తే వాటిని సంబంధిత ఏజెన్సీలు మాత్రమే విచారించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఈ అంశాలన్నీ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి కలిసివస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement

తాజా వార్తలు

Advertisement