Saturday, April 20, 2024

PM Modi: నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమావేశం.. కోవిడ్ పై కీలక ప్రకటన చేసే ఛాన్స్!

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ఓ వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. మరోవైపు కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా కోవిడ్ కేసులు వేల నుంచి లక్షల్లో చేరాయి. తాజాగా 2.47 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో కోవిడ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.   ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అత్యధికంగా వ్యాపించే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త ఆంక్షలు విధించారు.

ఈ క్రమంలో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసుల నియంత్రిణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్రల ముఖ్యమంత్రులకు ప్రధాని పలు సూచనలు చేసే అవకాశం ఉంది.

ఈ నెల 9వ తేదీన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం కోవివ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌, ఇతర అంశాలపై కీలకంగా చర్చించిన ప్రధాని మోడీ.. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే, కరోనాకు నియంత్రించేందుకు వ్యాక్సినే మార్గమని అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement