Friday, April 19, 2024

Breaking: గుజరాత్ ఘటనలో 35కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా మచ్చు నదిలో ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి కూలి 35 మంది చనిపోయారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. మోర్బీలో జరిగిన విషాదంపై తాను చాలా బాధపడ్డానని, దీనిపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర అధికారులతో మాట్లాడినట్టు ట్విట్టర్​తో పేర్కొన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, బాధితులకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని ప్రధాని మోదీ గుజరాతీలో ట్వీట్ చేశారు.

ఇక.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై సంతాపం ప్రకటిస్తూ ట్వీట్​ చేశారు.  గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన విషాదం నన్ను ఆందోళనకు గురి చేసింది. బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయం  చేయాలిఅని రాష్ర్టపతి ముర్ము ట్విట్టర్​లో పేర్కొన్నారు

కాగా, ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జాతీయ విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు. “మోర్బీ ప్రమాదం పట్ల చాలా బాధపడ్డాను. ఈ విషయమై గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీతో పాటు ఇతర అధికారులతో మాట్లాడాను. స్థానిక పరిపాలన పూర్తి సంసిద్ధతతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది, NDRF కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించాం’ అని అమిత్ షా ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement