Saturday, April 20, 2024

మ‌న్ కీ బాత్ లో చిన్న గ్రామం గురించి వివ‌రించిన.. ప్ర‌ధాని మోడీ

త‌మిళ‌నాడులో ఒక గ్రామం చిన్న‌దే కానీ ఎంతో జ‌నాద‌రణ క‌లిగిఉంద‌న్నారు ప్ర‌ధాని మోడీ.కాగా మోడీ నేడు మన్ కీ బాత్ ప్రసంగంలో ఆసక్తికర అంశం వెల్లడించారు. ఆ గ్రామం పేరు ఉతిర్మెరూర్ అని తెలిపారు. అక్కడ ఉన్న 12 వందల ఏళ్ల నాటి ఒక శిలాశాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఈ శిలాశాసనం ఒక చిన్న రాజ్యాంగం వంటిదని, ఇందులో గ్రామసభను ఎలా నడపాలి, సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ఎలా ఉండాలి అనే అంశాలు చక్కగా వివరించారని తెలిపారు. మనదేశ చరిత్రలోని ప్రజాస్వామ్య విలువలకు మరో ఉదాహరణగా 12వ శతాబ్దపు బసవేశ్వరుడి అనుభవ మండపం అని పేర్కొన్నారు. అక్కడ స్వేచ్ఛా వాదనలకు, చర్చలకు ప్రోత్సాహం లభించేదని వివరించారు. ఇది మాగ్నా కార్టా ముందు కాలం నాటిదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అని వ్యాఖ్యానించారు. మాగ్నా కార్టా ఆవిర్భావంతో 800 ఏళ్ల నాడు ప్రజాస్వామ్యం పురుడుపోసుకోవడం ఒక చారిత్రాత్మక సంఘటన. అప్పట్లో రాజులే సర్వాధికారంతో కొనసాగేవారు. బ్రిటన్ రాచరికంలో అయితే చక్రవర్తులు దైవాంశ సంభూతులు అనేంతగా ప్రజలపై నిరంకుశత్వాన్ని రుద్దారని చెప్పారు మోడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement