Friday, April 19, 2024

ప్లాస్టిక్ బ్యాన్.. పొల్యుష‌న్ కంట్రోల్ పై ప్రభుత్వ కార్యాచ‌ర‌ణ‌..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా రెండు విడతలుగా ప్లాస్టిక్‌ సంబంధించిన వస్తువుల తయారీతోపాటు వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఆదేశాల ఆయా కంపెనీలకు ప్రత్యామ్నాయాలను చూపడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఒకసారి వాడి పారేసిన (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వ్యర్థాలు రాష్ట్రంలో గుట్టల్లా పేరుకుపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 150 పరిశ్రమలకు ఎఫెక్ట్‌ పడుతోంది. ఈ పరిశ్రమల్లో పని చేసే కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.

2018, 2019 సంవత్సరాల్లో ప్లాస్టిక్‌ పరిశ్రమలు 242 ఉండగా.. 2020 నాటికి 316కు పెరిగాయి. ఈ 316 ప్లాష్టిక్‌ పరిశ్రమలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో సింగిల్‌ యూజ్డ్‌ ( ఒకసారి వాడిపారే పరిశ్రమలు ) ప్రస్తుతం రాష్ట్రంలో 150 కి పైగా ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ ) అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీటితో తయారయ్యే వస్తువులన్నింటిపై ప్రభుత్వం వచ్చే సంవత్సరం జూలై నుంచి నిషేధం అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగా వీటిలో పని చేస కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గం చూపడానికి కార్మిక శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

వంద మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లపై ప్రభుత్వం నిషేధించారు. ఒకసారి వాడిపారేవసిన ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, ఉత్పత్తి, ఎగుమతి, స్టాక్‌ పెట్టుకోవడం, అమ్మకం, సరఫరా, పంపిణీ వినియోగంతో పాటు బెలూన్లు, ప్లాస్టిక్‌ జెండాలు, ఐస్‌క్రీం, క్యాండిళ్లకు ఉపయోగించే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, అలంకరణకు ఉపయోగించే థర్మకోల్‌, ప్లేట్లు, గ్గాసులు ఫోర్క్‌లు, స్ఫూన్లు, కత్తులు, స్ట్రాలు , ట్రేలు, స్వీట్‌ బాక్స్‌ల ప్యాకింగ్‌ చేసే ఫిల్మ్‌ ఇన్విటేషన్‌ కార్డులు, సిగరేట్‌ ప్యాకెట్లు లాంటివి వంద మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న వాటిని నిషేధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement