Thursday, April 25, 2024

మొక్కల పెంపకంలో దేశానికి దిక్సూచి తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మొక్కలు పెంపకంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది. ఏటా మొక్కలు నాటుతుండటంతో క్రమంగా రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మొక్కల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రమే ముందంజలో ఉంది. ఏడేళ్ళ క్రితం సిఎం కేసీఆర్‌ హరితయజ్ఞం ప్రారంభించారు. రాష్ట్రమంతా పచ్చదనమే పెంపు దిశగా 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం పెట్టుకోగా, 239.87 కోట్ల మొక్కలను లక్ష్యాన్ని మించి నాటారు. ఈ క్రమంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు హరితనిధికు సిఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారు. హరితనిధికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. హరితహారం కార్యక్రమం కొనసాగింపుగా గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ప్రకృతివనాలు, బృహత్‌ వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇంటింటికి ఆరేసి మొక్కలను పంచిపెట్టి వాటిని బ్రతికించే బాధ్యత కుటుంబాలకే అప్పగించారు. మరోపక్క క్షీణించిన అటవీ ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు వేగంగా జరుగుతు న్నాయి. పట్టణ, నగర ప్రజలు స్వేద తీరేందుకు పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న అడవుల్లో అర్బన్‌ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేశారు. రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం 109 ఫారెస్టు పార్కులను నిర్మిస్తున్నారు. ఆరు విడతల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ పునరుద్ధరణతో పాటు సామాజిక అటవీకరణ పేరుతో దాదాపు 160 కోట్ల మొక్కలను నాటారు. ఈ ఏడాది ఏడో విడత హరితహారంలో భాగంగా మరో 80 కోట్ల మొక్కలను నాటారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజల భాగస్వామ్యం సహకారంతో విజయవంతంగా నడుస్తోన్న విషయం తెలిసిందే. అయితే మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రధానంగా అటవీశాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, మున్సిపల్‌ శాఖ చురుగ్గా పాల్గొ నడం గమనించవచ్చు. హరితహారంలో భాగంగా సోమా జిక అడవులు, అటవీ పునరుద్ధరణ, ప్రకృతి వనాలు తది తర కార్యక్రమాల కోసం 2014-15 నుంచి ఇప్పటి వరకు రూ.6555.97 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఉపాధికి భరోసా..
తెలంగాణకు హరితహారం లక్ష్య సాధనలో భాగంగా ప్రణాళిక ప్రకారం ఉపాధి కూలీలకు తగినంత పని కల్పిస్తున్నారు. సుమారు పది లక్షల మందికి మొక్కల పెంపకం ద్వారా వంద పనిదినాలను కల్పిస్తున్నారు. రోజుకు సగటును రూ.211 వేతనాన్ని చెల్లిస్తున్నారు. రహదార్ల వెంబడి నాటిన మొక్కల రక్షణకు ఒక్కో ఉపాధి కూలీకి కిలోమీటర్‌ దూరం చొప్పున బాధ్యతలు అప్పగించి రోజుకు రూ.211 సగటు వేతనాన్ని చెల్లిస్తున్నారు.

పెరుగుతున్న అటవీ విస్తీర్ణం..
జాతీయ అటవీ విస్తీర్ణం 21.34 శాతం ఉంటే, తెలంగాణ మొత్తం 24.05 శాతం ఉంది. ఈ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఏటా క్రమం తప్పకుండా మొక్కలు నాటడంతో 2014 నుంచి 2017 మధ్యలో రాష్టమంతట పచ్చదనం 3.67 శాతానికి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement