Thursday, April 25, 2024

సీఎం పదవికి పినరయి విజయన్ రాజీనామా

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో విజయన్.. సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కలిసి, తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే, తదుపరి ప్రభుత్వ ఏర్పడేంత వరకు సీఎంగా కొనసాగాలని విజయన్ ను గవర్నర్ కోరారు.

కాగా, నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నిక ఫలితాలో ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. గత నాలుగు దశాబ్దాల కేరళ రాజకీయ చరిత్రలో ఓకే వ్యక్తికి వరుసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితి లేదు. ఆ సాంప్రదాయాన్న వదిలిపెట్టిన కేరళ ప్రజలు… విజయన్ కు వరుసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారు. పినరయి విజయన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement