Saturday, December 10, 2022

వైరల్ అవుతోన్న.. జర్మనీకి చెందిన 16వ శతాబ్దపు ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటో

జర్మనీకి చెందిన 16వ శతాబ్ధపు ఎంగేజ్ మెంట్ రింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను అమితంగా ప్రేమించే వ్య‌క్తి చేతిలో యావ‌త్ ప్ర‌పంచం ఇమిడిఉంద‌నేలా ఈ రింగ్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్ట్‌కు 1.52 ల‌క్ష‌లకు పైగా లైక్స్‌తో పాటు పెద్ద‌సంఖ్య‌లో రియాక్ష‌న్స్ వ‌చ్చాయి.ఖ‌రీదైన సాలిటైర్స్ కంటే ఇది ఎంతో అర్ధ‌వంతంగా, మెరుగ్గా ఉంద‌ని ఈ రింగ్‌పై నెటిజ‌న్లు మ‌న‌సు పారేసుకున్నారు. ఈ రింగ్ ప్రేమ‌కు స‌రైన సంకేత‌మ‌ని ప‌లువురు నెటిజ‌న్లు కితాబిచ్చారు. ఈ రింగ్ చూసిన మ‌రుక్ష‌ణ‌మే తాను య‌స్ చెబుతాన‌ని ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ తెలిపారు. అయితే ఇలాంటి రింగ్స్ ఇప్ప‌టికీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయ‌ని మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement