Tuesday, April 23, 2024

లండన్‌ కింగ్స్‌ కాలేజీతో ఫార్మాసిటీ ఒప్పందం.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, రీసెర్చి కేంద్రం ఏర్పాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మంత్రి కేటీఆర్‌ మూడోరోజు యూకే పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ ఫార్మాసిటీపై తెలంగాణ ప్రభుత్వం లండన్‌లోని కింగ్స్‌ కాలేజీతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం కింగ్స్‌ కాలేజీని కేటీఆర్‌ బృందం సందర్శించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, లైఫ్‌సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న ఫార్మాయూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకడమిక్‌ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కింగ్స్‌ కాలేజీ పనిచేయనుంది.

ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కింగ్స్‌ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం భారత్‌, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారనుందన్నారు. ఫార్మా పరిశోధన శిక్షణలో ప్రపంచంలోని అత్యంత నైపుణ్యం కల యనివర్సిటీతో తమ ప్రభుత్వం కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఫార్మాయూనివర్సిటీ పరిశోధన, బోధన అంశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్స్‌ కాలేజీ లండన్‌ అధ్యక్షులు, ప్రిన్సిపాల్‌ షిట్టికపూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement