Thursday, April 25, 2024

మండిపోతున్న పెట్రోల్ ధరలు..

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతునే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఏడు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటింది. తాజాగా హైదరాబాద్ లోను పెట్రోలు రేటు లీటరు వంద రూపాయలు దాటింది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్కెట్‌ను ధాటింది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100.20కు చేరగా.. డీజిల్‌ లీటర్‌ రూ.95.14కు పెరిగింది. దాదాపు ఐదారు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 దాటింది.

గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా.. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది. మరో వైపు డీజిల్‌ సైతం రూ.100 వైపు వేగంగా పరుగులు పెడుతున్నది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41, డీజిల్‌ రూ.87.28కు చేరింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 25వసార్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్‌రూ.107, లీటర్‌ డీజిల్‌ రూ.100కుపైగా దాటింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement