Saturday, April 20, 2024

పెట్రోల్..డీజిల్ రేట్స్ ఎక్క‌డ..ఎలా ఉన్నాయంటే..

పెట్రోల్,డీజిల్ రేట్లు ఆకాశానంటుతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ త‌గ్గించాయి. 25 రాష్ట్రాలు మాత్రమే వ్యాట్ తగ్గించాయి. ఇంకా పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాల్సి ఉంది.మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, ఝార్కండ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఇంకా వ్యాట్ తగ్గించలేదు. వ్యాట్ తగ్గింపుతో పంజాబ్‌లో పెట్రోల్ ధర ఎక్కువగా రూ.16 మేర దిగొచ్చింది. లడక్‌లో రూ.13.43, కర్నాటకలో రూ.13.35 తగ్గింది. ఇకపోతే అండమాన్ నికోబార్‌లో పెట్రోల్‌ తక్కువ రేటుకే లభిస్తోంది. ఇక్కడ లీటరు పెట్రోల్ రూ.82.96. ఇటానగర్‌లో కూడా లీటరు పెట్రోల్ రూ.92గా ఉంది. రాజస్థాన్, జైపూర్‌లో పెట్రోల్ ధర ఎక్కువగా రూ.117.5గా ఉంది. ముంబైలో రూ.115.85 వద్ద కొనసాగుతోంది. అండమాన్ నికోబార్‌లో డీజిల్ రేటు తక్కువగా రూ.77గా ఉంది. ఇకపోతే హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. లీటరుకు పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement