Friday, April 26, 2024

గంటకి 310కి.మీ వేగంతో ..బైక్ నడిపిన వ్యక్తి

గంటకి 310కి.మీ వేగంతో ఓ వ్యక్తి బైక్ ని నడిపిన వీడియో వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. వైల్డ్ వింగ్ రైడర్’ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ అయింది. ఇందులో బైకర్ దిల్‌ప్రీత్, మరికొందరు బైకర్లతో కలిసి రైడ్ కోసం బయలుదేరాడు. వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు అతను 310 కి.మీ వేగాన్ని చాలాసార్లు తాకినట్లు కనిపించింది. బైకర్లు నింజా 2000, బీఎండబ్ల్యూ, డ్యుకాటీ, అపాచీ 310 వంటి హై ఎండ్ బైకులపై వాయు వేగంతో దూసుకెళ్లారు. 300 కి.మీ వేగం అందుకున్న రైడర్ దిల్‌ప్రీత్ తన మాదిరిగా ఎవ్వరూ ఇలాంటి సాహనం చేయొద్దని వీక్షకులను హెచ్చరించాడు.  కొన్ని రోజుల క్రితం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇలానే నలుగురు స్నేహితులు బీఎండబ్ల్యూ కారులో వేగంగా కారు నడిపి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి ముందు ఈ నలుగురూ కారు వేగాన్ని చూపిస్తూ ఫేస్ బుక్ లో లైవ్ వీడియో చేశారు. అప్పటికే 230 కి.మీ. వేగం అందుకోగా.. డ్రైవర్ 300 కి.మీ. వేగం అందుకోవడానికి ప్రయత్నించాడు. అలా చేస్తే మనం నలుగురం చనిపోతాం అని మరో వ్యక్తి చెప్పడం వినిపించింది. అతను అన్నట్టుగానే తీవ్ర వేగంతో కారు.. ట్రక్కును ఢీకొట్టి నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement