Sunday, March 19, 2023

సింగ‌ర్ పై క‌రెన్సీ వ‌ర్షం.. వైర‌ల్ గా వీడియో

అభిమానుల‌కి ఆనందం వ‌స్తే అంతే ఏమ‌యినా చేస్తారు. అందుకే ఇక్క‌డ ఓ సింగ‌ర్ పై క‌రెన్సీ నోట్ల వ‌ర్షాన్ని కురిపించారు అభిమానులు. గుజ‌రాత్ జాన‌ప‌ద‌గాయ‌కుడు కీర్తిద‌న్ గ‌ద్వి గానామృతానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. అతనిపై కరెన్సీ నోట్లను పూలలా చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలో వల్సాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌లో కూడా కీర్తిదన్‌ పాడిన పాటకు ఫిధా అయిన అభిమానులు అతడిపై లక్షల రూపాయలు వెదజల్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement