గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్నపై పీడీ యాక్ట్ నమోదైంది. హైదరాబాద్ పోలీసులు శేషన్నపై పీడీ యాక్ట్ పెట్టారు. శేషన్నను అరెస్ట్ చేసి చంచలగూడా జైలుకు తరలించారు. ఆయనపై 11 కేసులు నమోదు చేశారు. కోనపురం రాములుతో పాటు మహబూబ్ నగర్ లో ఓ కానిస్టేబుల్ హత్య కేసులో శేషన్న నిందితుడుగా ఉన్నాడు. ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా పరారీలో ఉండగా..3 నెలల క్రితం దేశీ గన్ తో పాటు 5 లైవ్ రౌండ్స్ తో పోలీసులకు దొరికాడు.
- Advertisement -