Saturday, April 20, 2024

‘వకీల్ సాబ్’ కేక… సినిమా ఎలా ఉందంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’గా తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చారు. దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్’ తో సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసి ఈ రోజు (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిన్న (గురువారం) రాత్రి ఓవర్సీస్ తెరపై ప్రదర్శించబడింది. ఈ మూవీ చూసిన అక్కడి ఆడియన్స్ ట్విటర్ వేదికగా తమ తమ అభిప్రాయలు చెబుతున్నారు. సినిమాపై అక్కడి ఆడియన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండటం, అందులోనూ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పింక్‌ రీమేక్ కావడం, పైగా ఈ చిత్రంలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే యూఎస్‌లో అత్యధిక లోకేషన్స్‌లో గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కేకో కేక అంటున్నారు. పవర్ స్టార్ కెమెరా ముందు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్‌మెన్స్ ఇచ్చారని, కోర్టు సీన్స్‌లో ఇరగదీశారని అంటున్నారు.  ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని, సినిమాలో హైలైట్ అదే అనేది ఆడియన్స్ చెబుతున్నారు. థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement