Thursday, April 25, 2024

Flash News: జనసేన సమావేశం వాయిదా.. కారణం ఏంటంటే

మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం జరగాల్సిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశాన్ని వాయిదా వేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది తదుపరి తెలియజేస్తామని జనసేన వర్గాలు పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ముందు జాగ్రత్తగా పార్టీ సమావేశాన్ని పవన్ కల్యాణ్ వాయిదా వేశారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యే సమయంలో కరోనా వ్యాప్తి ఉండటం బాధకరమని చెబుతూ.. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement