Thursday, May 26, 2022

తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న – ఏర్పాట్లు చేస్తోన్న జ‌న‌సేన

అస‌ని తుఫాన్ బాధితుల‌ను అన్ని విధాలా ఆదుకోవాల‌ని రైతాంగానికి ప్ర‌భుత్వం భ‌రోసా ఇవ్వాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్. రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని… ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని.. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరమని అన్నారు . ఈ నెల 14న తెలంగాణలో జనసేన పార్టీ అధినే పవన్‌ కళ్యాణ్‌ పర్యటించనున్నారు. నల్గొండ జిల్లాలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటించనున్నారు. ఈ నెల 14న హుజూర్నగర్, చౌటుప్పల్ నియోజకవర్గాలలో చనిపోయిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ జనసేన పార్టీ శ్రేణులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement